పాప్ రారాజు ఆస్తుల వివాదం: ఆరు వందల మిలియన్లు డిమాండ్ చేసిన కూతురు
రిపోర్టర్: సతీష్
స్థలం: Los Angeles
పాప్ సంగీత దిగ్గజం మైఖేల్ జాక్సన్ కుమార్తె పారిస్ జాక్సన్ తన తండ్రి ఆస్తుల నుంచి ఆరు వందల మిలియన్ డాలర్లు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. తన తండ్రి వీలునామాను అమలు చేయడంలో ఎస్టేట్ ఎగ్జిక్యూటర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని, తమకు రావాల్సిన సంపదను అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. దాదాపు పదిహేడేళ్లుగా తమకు రావాల్సిన వాటాను ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని పారిస్ జాక్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.