కర్ణాటకలో యాభై ఐదు ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన వర్షపాత లోటు
రిపోర్టర్: శివ
స్థలం: Mysuru
కర్ణాటక రాష్ట్రంలో ఐదు దశాబ్దాల గరిష్ట స్థాయి వర్షపాత లోటు నమోదైందని కేఎస్ఎన్డీఎంసీ మాజీ డైరెక్టర్ జి. శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. జూన్ నుండి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం కన్నా ముప్పై ఐదు శాతం తక్కువగా నమోదైందని ఆయన తెలిపారు. మైసూర్, విజయనగర జిల్లాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, కావేరి బేసిన్ జలాశయాలలో నీటి మట్టాలు భారీగా పడిపోయాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.