అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు 'అనకాపల్లి' సినిమా!
రిపోర్టర్: కిరణ్
స్థలం: అనకాపల్లి
భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై తెరకెక్కిన రా అండ్ రస్టిక్ చిత్రం 'అనకాపల్లి'. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ భారీ ఎత్తున అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.