యమునా ఎక్స్ప్రెస్వేపై ఏసీ బస్సు దగ్ధమై తొమ్మిది మంది మృతి

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా యమునా ఎక్స్ప్రెస్వేపై ఏసీ పేలి స్లీపర్ బస్సు దగ్ధమైన ఘటనలో తొమ్మిది మంది సజీవదహనమయ్యారు. దిల్లీలోని కశ్మీరీ గేట్ నుంచి వస్తున్న ఈ బస్సుపై గతంలో అరవైకి పైగా ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్లు రికార్డులు వెల్లడించాయి. డ్రైవర్, కండక్టర్ నిర్లక్ష్యమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు.