వరికుంటపాడు మండలంలో దశాబ్దాల రోడ్డు కల సాకారం చేసిన కూటమి ప్రభుత్వం
రిపోర్టర్: రాజేష్
స్థలం: నెల్లూరు
ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని కాకొల్లువారిపల్లె నుంచి హుస్సేన్‌నగర్ మీదుగా రామాపురం వరకు దశాబ్దాలుగా సరైన రహదారి లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల కల ఎట్టకేలకు కూటమి ప్రభుత్వ హయాంలో నెరవేరింది. తొలి విడతగా రూ. 1.64 కోట్లతో 2.4 కి.మీ తారు రోడ్డు వేయగా, మిగిలిన 2.6 కి.మీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మరో రూ. 2.08 కోట్లు మంజూరు చేయించారు. ఈనెల 24న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ రానుండటంతో గ్రామంలో పలు అభివృద్ధి పనులకు అంకురార్పణ జరగనుంది.