అమీన్పూర్ లో రెవెన్యూ అధికారుల కొరడా: ప్రభుత్వ భూముల్ లోని అక్రమ నిర్మాణాలు కూల్చివేత

రిపోర్టర్: నరేష్ స్థలం: అమీన్‌పూర్

అమీన్పూర్ మండల పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారని ఎంఆర్ఓ వెంకటేశ్ తెలిపారు. అమీన్పూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 993/1 లో ప్రభుత్వ భూమిలో చేపట్టిన అనధికార నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేశామని ఆయన పేర్కొన్నారు. వాణీనగర్ కాలనీ సమీపంలోని పెద్ద చెరువులో అక్రమంగా ఏర్పాటు చేసిన బోర్వెల్ను కూడా ధ్వంసం చేశామని వెల్లడించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించినా లేదా అనధికార నిర్మాణాలు చేపట్టినా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.