మంత్రాలయం ఎన్నికల పోలింగ్ లో ఎస్పీ విక్రాంత్ పాటిల్ వార్నింగ్
రిపోర్టర్: AMPAIAH ACHARI
స్థలం: ఎమ్మిగనూరు
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. ఎర్రకోట, మంత్రాలయం, మాధవరం గ్రామాల్ లో పర్యటించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఓటర్లు ఎటువంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని ఆయన కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసులకు దిశానిర్దేశం చేశారు.