'కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు': ఎమ్మెల్యే గౌతు శిరీష ఫైర్
రిపోర్టర్: Dinesh panda
స్థలం: పలాస
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే గౌతు శిరీష మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మెగా డీఎస్సీపై వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, ఇది కోడి గుడ్డు మీద ఈకలు పీకడం లాంటిదని మండిపడ్డారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నిరుద్యోగులకు ఏమీ చేయలేదని, మంత్రి నారా లోకేష్ 16 వేల డీఎస్సీ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేశారని స్పష్టం చేశారు. అవకతవకలపై నిజంగా ఆధారాలు ఉంటే కోర్టులో నిరూపించాలని ఆమె సవాల్ విసిరారు.