కొత్త ప్రకటన వివాదంపై స్పందించిన నటి సిడ్నీ స్వీనీ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: World
ప్రముఖ హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీ నటించిన తాజా వాణిజ్య ప్రకటన తీవ్ర వివాదాస్పదమైంది. ఈ యాడ్‌లో ఆమె దుస్తులు లేకుండా కేవలం క్రీడా పరికరాలతో కనిపించడంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన నటి, గతంలో ప్రముఖ క్రీడాకారులు చేసిన ఇలాంటి ప్రచార చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విమర్శలకు పరోక్షంగా గట్టి బదులిచ్చారు.