టెన్త్లో మూడుసార్లు ఫెయిల్ అయ్యా: నటి అక్షర హాసన్ సంచలన వెల్లడి

రిపోర్టర్: హరి స్థలం: చెన్నై

తాను పదవ తరగతి పరీక్షల్లో వరుసగా మూడుసార్లు విఫలమైనట్లు నటి అక్షర హాసన్ వెల్లడించారు. సైరస్ బ్రూచా పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆమె తన సినీ ప్రయాణం, చదువుకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చదువులో వైఫల్యాలు ఎదురైనా తనకు నచ్చిన కళలు, సినిమా రంగంపైనే దృష్టి పెట్టానని తెలిపారు. తన కుటుంబంలో ఎలాంటి ఒత్తిడి లేదని, తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛను తల్లిదండ్రులు కల్పించారని ఆమె పేర్కొన్నారు.