ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పల్లెనిద్ర చేసిన ఎస్సై
రిపోర్టర్: SKLM NEWS
స్థలం: లావేరు
ప్రజలకు మరింత చేరువ కావడానికి, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు లావేరు మండలం పెద్దరావుపల్లి గ్రామంలో ఎస్సై సందీప్ కుమార్ పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో మమేకమై, రాత్రి సమయంలో గ్రామంలోనే బస చేశారు. ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ గోవిందరావుతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.