పోలవరం గిరిజన నిర్వాసితులకు ఓటీఎస్ విధానం వర్తింపుపై ప్రభుత్వ కసరత్తు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులవుతున్న గిరిజన కుటుంబాలకు వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ విధానాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏడు విలీన మండలాల్లోని ఎస్టీ కుటుంబాల నుంచి ఓటీఎస్ డిమాండ్లు ఎక్కువగా వస్తున్నట్లు పునరావాస అధికారులు ప్రభుత్వ దృష్టికి తెచ్చారు. ఈ మూడో ఆప్షన్‌కు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం.