పట్టణాల్లో అధ్వానంగా సామాజిక శౌచాలయాలు: ఇబ్బందుల్లో వేలాది మంది ప్రజలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలోని పలు పట్టణాల్లో సామాజిక శౌచాలయాలు అధ్వానంగా మారాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. బొబ్బిలి, రాజాం, విజయనగరం, నెల్లిమర్ల ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిరుపయోగంగా మారడంతో వేలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులు తెలిపారు. గత పాలకవర్గాల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి నెలకొందని, మరమ్మతుల పేరుతో నిధులు ఖర్చు చేస్తున్నా క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.