స్వచ్ఛతకు ప్రతీకగా కార్మికులు: నర్సంపేటలో శానిటేషన్ సిబ్బందికి ఘన సన్మానం

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని పదవారవ వార్డులో గాంధీ జయంతి వేడుకల సందర్భంగా నిత్యం సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కౌన్సిలర్ బానోతు నవీన్ నాయక్ శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు. వీధుల శుభ్రతలో కార్మికుల శ్రమ ఎంతో కీలకమని కొనియాడారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు.