మచిలీపట్నంలో మోసపోయిన యువతి భర్త ఇంటి ముందు నిరసన

రిపోర్టర్: రాము స్థలం: మచిలీపట్నం

మచిలీపట్నంలో రహస్య వివాహం చేసుకొని మోసం చేసిన భర్త తీరును నిరసిస్తూ బాధితురాలు జయలక్ష్మి భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. విజయవాడ దుర్గగుడిలో గత ఏడాది ఆగస్టు 30న పెంకు ఫణి కుమార్, జయలక్ష్మి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత భర్త ముఖం చాటేయడంతో పాటు, న్యాయం కోసం అత్తారింటికి వెళితే అటువైపు వారు తనపై దాడి చేసి అవమానించారని బాధితురాలు వాపోయింది.