లక్నోలో షాకింగ్ ఘటన: బీజేపీ ఎమ్మెల్యేకే కుచ్చుటోపి పెట్టిన దంపతుల అరెస్ట్
రిపోర్టర్: రాము
స్థలం: Lucknow
కేంద్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ అనుమతులు ఇప్పిస్తానంటూ సుల్తాన్పూర్ సదర్ బీజేపీ ఎమ్మెల్యే వినోద్ సింగ్‌కు టోపీ పెట్టిన దంపతులను లక్నో పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్హెచ్ఓ శివానంద్ మిశ్రా వెల్లడించారు. నిందితుడు శశాంక్ పాండే తన సోదరుడు ఐఏఎస్ అధికారిగా ఉన్నాడని నమ్మించి, సీడబ్ల్యూసీ ఛైర్మన్‌తో పరిచయాలున్నాయని చెప్పి భారీగా నగదు వసూలు చేసినట్లు తెలిపారు. ఈ మోసంపై అనుమానం వచ్చిన ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.