అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన భారత్: సిల్వర్ మెడల్ గెలుచుకున్న కోవిద్

రిపోర్టర్: కృష్ణ స్థలం: Shanghai

చైనాలోని షాంఘై వేదికగా జరిగిన అంతర్జాతీయ వరల్డ్ స్కిల్స్ పోటీల్లో డిజిటల్ ఇంటరాక్టివ్ మీడియా డిజైన్ విభాగంలో భారత్ తరఫున కోవిద్ అజయ్ గంగ్రేడ్ రజత పతకం సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ముంబై నిఫ్ట్ విద్యార్థి అయిన ఆయన ఏడాది పాటు కఠిన శ్రమకోర్చి ఈ విజయం సాధించానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఈ ఘనత సాధించానని పేర్కొంటూ, దేశం కోసం పతకం గెలవడం ఎంతో గర్వకారణమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.