మెగా హీరో వివాహం: త్వరలో సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

మెగా మేనల్లుడు, యంగ్ హీరో సాయి దుర్గా తేజ్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నట్లు సినీ వర్గాల్ లో తీవ్ర ప్రచారం జరుగుతోందని సన్నిహితులు తెలిపారు. నవంబర్ 5న అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో ఈ హీరో ఎంగేజ్మెంట్ వేడుక చాలా సింపుల్గా జరగబోతున్నట్లు సమాచారం. అలాగే డిసెంబర్ నెలలోనే హైదరాబాద్ వేదికగా ఈ వివాహ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించేందుకు మెగా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.