అమెరికాలో హెచ్-1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ తీవ్ర నిఘా: ఉత్కంఠ

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమెరికా

అమెరికాలో విదేశీ ఉద్యోగులకు జారీచేసే హెచ్-1బీ వీసాల కార్యక్రమం మరింత కఠినతరం కానుందని అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి'ఎస్పోసిటో స్పష్టం చేశారు. వలస విధానాలను నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ వారంలోనే కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ఆయన సంకేతాలు ఇవ్వడంతో విదేశీ ఉద్యోగులలో, కంపెనీలలో తీవ్ర ఆందోళన నెలకొంది. అమెరికన్ల ప్రయోజనాల రక్షణే ధ్యేయంగా ట్రంప్ యంత్రాగం ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తోంది.