పొదలకూరులో వైభవంగా పోలేరమ్మ జాతర: తరలివచ్చిన వేలాది మంది భక్తులు

రిపోర్టర్: నరేష్ స్థలం: పొదలకూరు

గ్రామశక్తి పోలేరమ్మ జాతరలో భాగంగా అమ్మవారిని దర్శించుకొనేందుకు గురువారం భక్తులు పోటెత్తారని న్యూస్టుడే వెల్లడించింది. వేలాది మంది గంటల తరబడి క్యూలైన్లలో బారులుదీరారని, జాతరలో అత్యంత కీలక ఘట్టమైన అమ్మవారి తరలింపు కార్యక్రమం వేకువజామున నిర్వహించారని పేర్కొన్నారు. అత్తగారి ఇల్లుగా భావించే పోలేరమ్మ మాన్యం వద్ద చాకలి సాంగ్యం సంప్రదాయబద్ధంగా నిర్వహించి అమ్మవారిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారని, మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఈ జాతర రాత్రికి నిమజ్జనంతో ముగిసిందని నిర్వాహకులు తెలిపారు.