తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం జరిగింది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా డిసెంబర్ 7 నుండి 9 వరకు ఈ ప్రపంచ పెట్టుబడుల సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సు ఏర్పాట్లు మరియు భవిష్యత్ కార్యాచరణపై ఉన్నతాధికారులతో చర్చించారు.