నెల్లూరులో సఫాయి కర్మచారుల సంక్షేమం కోసం అధికారులకు విజ్ఞప్తి

రిపోర్టర్: sujith reddy స్థలం: నెల్లూరు అర్బన్

నెల్లూరు కలెక్టరేట్ తిక్కన భవన్లో జిల్లా స్థాయి సఫాయి కర్మచారి సమావేశం నిర్వహించారు. జిల్లా సోషల్ వెల్ఫేర్ డిడి శోభారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ ఎం. వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సఫాయి కర్మచారి జిల్లా మెంబర్ ఆరుముళ్ల మురళీ మాట్లాడుతూ, 94 మంది కార్మికులకు పునరావాసం కల్పించాలని, ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు మంజూరు చేయాలని కోరారు. అలాగే కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, కుటుంబాలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అధికారులను కోరారు.