హైదరాబాద్‌లో ఘనంగా ‘ఎపిక్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ట్రైలర్ హైదరాబాద్‌లో ఘనంగా విడుదలైంది. ముఖ్య అతిథిగా హాజరైన రష్మిక మందన్న ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించారు. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా కథ, వైష్ణవి పాత్ర తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని రష్మిక పేర్కొన్నారు.