శ్రీహరికోటలో ఇస్రో ఘనవిజయం: విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17

రిపోర్టర్: కృష్ణ స్థలం: తిరుపతి

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 ప్రయోగం విజయవంతమైంది. 2,367 కిలోల బరువున్న ఈవోఎస్-05 ఉపగ్రహాన్ని రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టే సామర్థ్యం ఉన్న ఈ ఉపగ్రహం, అంచనాలను మించి 31,026 కి.మీ ఎత్తులో స్థిరపడింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించారు. గత వైఫల్యాలను చెరిపేస్తూ ఇస్రో శాస్త్రవేత్తలు ఈ మిషన్‌ను అత్యంత కచ్చితత్వంతో పూర్తి చేశారు.