డిజిటల్ తరగతులకు బ్రేక్: పెన్, పేపర్ విధానానికి మారిన చారిత్రక కాలేజీ

రిపోర్టర్: సురేష్ స్థలం: London

విద్యార్థులలో పెరుగుతున్న డిజిటల్ వ్యామోహాన్ని, ఏకాగ్రత లోపాన్ని తగ్గించేందుకు ఇంగ్లండ్లోని ప్రఖ్యాత విన్చెస్టర్ కాలేజీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ ఎలిజబెత్ స్టోన్ వెల్లడించారు. తరగతి గదులలో ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లను తగ్గిస్తూ, పూర్తిగా పెన్, పేపర్ మరియు టెక్స్ట్ బుక్స్ విధానాన్ని మళ్లీ అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు. విద్యార్థులకు టెక్నాలజీ వల్ల కలిగే పరధ్యానాన్ని అరికట్టేందుకే ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నట్లు కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది.