పిడుగురాళ్లలో పోలీసుల వేధింపులంటూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

రిపోర్టర్: రాము స్థలం: Piduguralla

పిడుగురాళ్లలో పోలీసుల వేధింపులు తాళలేక నరసరావుపేటకు చెందిన కిశోర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. లలిత ఇన్‌స్టిట్యూట్ ద్వారా స్టూడెంట్‌ను విదేశాలకు పంపే విషయంలో వివాదం తలెత్తింది. డబ్బుల కోసం తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారని, పోలీసుల వేధింపులే తన నిర్ణయానికి కారణమని సెల్ఫీ వీడియోలో కిశోర్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.