గ్యాస్ కనెక్షన్లకు అక్టోబర్ లోపు ఆధార్ ఈకేవైసీ తప్పనిసరి
రిపోర్టర్: గోపి
స్థలం: తెలంగాణ
వంట గ్యాస్ సిలిండర్లను రాయితీపై పొందేందుకు వినియోగదారులు అక్టోబర్ మొదటి తేదీలోపు ఆధార్ బయోమెట్రిక్ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. గడువులోగా ఈకేవైసీ చేయించుకోని వారికి అక్టోబర్ నెల నుంచి రాయితీ సిలిండర్ల సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. నకిలీ కనెక్షన్ల తొలగింపు కోసమే ఈ నిబంధన తెచ్చినట్లు తెలిపారు.