వైభవ్ సూర్యవంశీని సచిన్ లా తీర్చిదిద్దే పనిలో బీసీసీఐ

రిపోర్టర్: కృష్ణ స్థలం: India

15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించింది. అతడు కేవలం ఒక సీజన్ మెరుపులా కాకుండా, సచిన్ టెండూల్కర్ లా సుదీర్ఘ కాలం దేశానికి సేవలు అందించేలా తీర్చిదిద్దుతామని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. వైభవ్ ప్రతి అడుగును నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, అతడికి సరైన మార్గదర్శకత్వం అందించి గొప్ప క్రికెటర్‌గా మారుస్తామని బీసీసీఐ భరోసా ఇచ్చింది.