సానుకూల సంకేతాలతో లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

గత కొన్ని సెషన్లుగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో సానుకూల ధోరణితో లాభాల్లో ముగిశాయని నిపుణులు తెలిపారు. ఆసియా మార్కెట్ల నుంచి అందిన గ్లోబల్ సంకేతాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు కాస్త శాంతించడంతో మార్కెట్లలో మళ్లీ కొనుగోళ్ల జోరు కనిపించింది. దీంతో బెంచ్ మార్క్ సూచీలైన బిఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ రెండు కూడా మెరుగైన లాభాలను నమోదు చేశాయి.