ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం కాలువలోకి దూకి యువకుడికి తీవ్ర గాయాలు

రిపోర్టర్: హరి స్థలం: ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం సాహసానికి పాల్పడిన యువకుడు ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. పాహుజ్ డ్యామ్ పై నుంచి ముప్పై అడుగుల ఎత్తులో ఉన్న నీటిలోకి దూకగా, కింద రాళ్లు ఉండటంతో రెండు కాళ్లూ విరిగిపోయాయి. స్నేహితులు ఈ స్టంట్‌ను వీడియో రికార్డ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలపాలైన అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.