శ్రీకాకుళం వైఎస్సార్సీపీలో తమ్మినేని చిరంజీవి నాగ్ సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: హరి స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో పార్టీకి ఒక్క సీటు కూడా రాదని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సర్వే నివేదికలను పరిశీలించుకోవాలని హెచ్చరించారు.