నల్లబెల్లి మండలం అర్వయ్యపల్లిలో ఇంటి గేటుకు కంచె వేసి బెదిరింపులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నల్లబెల్లి

నల్లబెల్లి మండలం అర్వయ్యపల్లి గ్రామంలో పాతకక్షల నేపథ్యంలో బాధితుడి ఇంటి ముందే ఇనుప కంచె ఏర్పాటు చేసి రాకపోకలను అడ్డుకున్న ఘటన వెలుగుచూసింది. ఈ నెల 8వ తేదీన కొందరు వ్యక్తులు సిమెంట్ స్తంభాలు పాతి కంచె వేసి, కుటుంబ సభ్యులను నరికి చంపుతామని బెదిరిస్తున్నట్లు బాధితుడు వాంకుడోత్ హర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు స్పందించి కంచె తొలగించి తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు.