జనసేన ర్యాలీలో పాల్గొన్న యువకులపై వైకాపా నేత దాడి

రిపోర్టర్: రాము స్థలం: కావలి

కావలి పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఇద్దరు యువకులపై వైకాపా నాయకుడు రషీద్ దౌర్జన్యానికి పాల్పడ్డాడని బాధితులు తెలిపారు. మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్న సయ్యద్ తలహర్, షేక్ ఆరిఫ్ అనే యువకులను ఫోన్లో పిలిచి రషీద్తోపాటు మరికొందరు దాడి చేశారని పేర్కొన్నారు. దాడి నుంచి తప్పించుకున్న బాధితులు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి, ఆసుపత్రిలో చికిత్స పొందగా సీఐ వై.రంగనాథ్ గౌడ్ విచారణ జరుపుతున్నారు.