బిగ్ బాస్ కంటెస్టెంట్ రియా అహిర్‌పై దారుణ ట్రోలింగ్

రిపోర్టర్: నరేష్ స్థలం: India

బిగ్ బాస్ కొత్త సీజన్‌లోకి ప్రవేశించలేకపోయిన రియా అహిర్ తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కొంటుంది. లవ్ గిల్ చేతిలో ఓడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఆమెపై అసభ్యకర కామెంట్లు వచ్చాయి. దీనిపై స్పందించిన రియా, ట్రాన్స్‌జెండర్ పదాన్ని బూతుగా వాడటంపై మండిపడ్డారు. ఆ కమ్యూనిటీ దేశంలో ఎంతో శక్తివంతమైనదని, దాన్ని గౌరవించాలని ఆమె ఘాటుగా బదులిచ్చారు.