హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద మారిన ట్రాఫిక్ ప్లాన్

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ గతంలో తలపెట్టిన ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌ల నిర్మాణాలను అధికారులు రద్దు చేశారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు అమలు చేసిన వన్ వే విధానం సత్ఫలితాలు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి బదులుగా నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు ఒకే ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించాలని కొత్తగా ప్రతిపాదించారు. ఈ రీ-అలైన్‌మెంట్ ద్వారా ప్రాజెక్టు వ్యయంతో పాటు భూసేకరణ ఖర్చు భారీగా తగ్గనుంది.