గరివిడి మండలంలో నాలుగు కోట్ల తొంబై లక్షలతో రహదారుల అభివృద్ధి

రిపోర్టర్: వెంకట్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా గరివిడి మండలంలో పల్లెపండగ మూడో విడతలో భాగంగా రూ.4.90 కోట్లతో చేపట్టనున్న రహదారుల అభివృద్ధి పనులకు చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు శంకుస్థాపన చేసినట్లు అధికారులు తెలిపారు. ఎనుగువలస, రేగటి అగ్రహారం-ఇప్పలవలస, కుమారాం-విజయరాంపురం, తాటిగూడ-గెడ్డపువలస, గరివిడి రైల్వేస్టేషన్-షేరిపేట రహదారుల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఈ రోడ్ల నిర్మాణంతో ప్రజల రవాణా కష్టాలు పూర్తిగా తొలగిపోతాయని ఆయన చెప్పారు.