తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు సంప్రదాయ దుస్తులు: వీవర్స్ సంక్షేమానికి సరికొత్త బాట

రిపోర్టర్: సునీల్ స్థలం: చెన్నై

తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు వారం వారం సంప్రదాయ దుస్తులు ధరించేలా ప్రత్యేక డ్రెస్ కోడ్ తీసుకురానున్నట్లు తమిళ అభివృద్ధి శాఖ మంత్రి రాజమోహన్ వెల్లడించారు. చెన్నైలో జరిగిన తమిళనాడు దినోత్సవ వేడుకల్ లో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. చేనేత కార్మికులకు అండగా నిలవడంతో పాటు సంస్కృతిని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.