వైఎస్సార్సీపీ మద్యం కుంభకోణంలో జగన్ కోటరీ పాత్రపై రజత్ భార్గవ సంచలన వాంగ్మూలం
రిపోర్టర్: రాజేష్
స్థలం: విజయవాడ
వైఎస్సార్సీపీ హయాంలో మద్యం కుంభకోణాన్ని జగన్ కోటరీయే నడిపించిందని అప్పటి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ విజయవాడలోని ఏసీబీ కోర్టులో స్పష్టం చేశారు. లంచాల కోసం మద్యం మూలధరలు పెంచాలని జగన్ పట్టుబట్టారని, నాటి సీఎంవో అధికారుల పర్యవేక్షణలోనే ఈ దందా సాగిందని ఆయన వాంగ్మూలంలో తేల్చి చెప్పారు. ఒత్తిడి వల్లే జీవోలు ఇవ్వాల్సి వచ్చిందని ఆయన కోర్టులో వివరించారు.