భూముల నిషేధిత జాబితాపై విచారణకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశం

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

తెలంగాణలో ఇరవై రెండు ఏ భూముల నిషేధిత జాబితాపై తక్షణమే స్వతంత్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. అమాయక ప్రజల ఆస్తులను అనాలోచితంగా నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై తక్షణ నివేదిక అందించాలని కమిషన్ స్పష్టం చేసింది.