ముంబైలో పిల్లుల హంతకుడు అరెస్ట్ అయిన 24 గంటల్లోనే విడుదల
రిపోర్టర్: వెంకట్
స్థలం: మహారాష్ట్ర
ముంబైలోని చెంబూర్‌లో వరుసగా పిల్లులను హత్య చేసిన కేసులో అరెస్టయిన శివ అనే నిందితుడు 24 గంటల్లోనే బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆగస్టు నుంచి దాదాపు 20 పిల్లులను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు బయటకు రావడంతో యానిమల్ యాక్టివిస్టులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతడిని మళ్లీ అరెస్ట్ చేయాలని పీటా సంస్థ డిమాండ్ చేస్తోంది.