ఖైరతాబాద్ గణేషుని దర్శించుకున్న క్రేజీ కల్యాణం చిత్ర యూనిట్
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రేజీ కల్యాణం సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేష ఆలయాన్ని సందర్శించింది. దర్శకుడు భద్రప్ప గజులతో పాటు నటుడు అఖిల్ రాజ్ ఉద్దేమరి వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామెడీ, కుటుంబ భావోద్వేగాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.