'బుక్ చేయని పార్సిల్ వచ్చిందా?': అల్లూరి పోలీస్ హెచ్చరిక
రిపోర్టర్: నరేష్
స్థలం: అల్లూరి సీతారామరాజు
ఆర్డర్ చేయని పార్సిళ్ల విషయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అల్లూరి పోలీస్ స్పష్టం చేశారు. తెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దని, పార్సిళ్ల పేరుతో అదనపు డబ్బులు చెల్లించవద్దని పేర్కొన్నారు. మోసగాళ్లు డెలివరీ బాయ్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని, అనుమానాస్పద లింకులు లేదా క్యూఆర్ కోడ్లను ఉపయోగించవద్దని హెచ్చరించారు. ఇలాంటి సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం అందించాలని అల్లూరి పోలీస్ కోరారు.