ఒడిశా అడవుల్లో అరుదైన ఐదు ఒరాంగుటాన్ పిల్లల రెస్క్యూ
రిపోర్టర్: సురేష్
స్థలం: ఒడిశా
ఒడిశాలోని బాలాసోర్ జిల్లా ఉదయపూర్-తల్సారీ అడవుల్లో ఐదు చిన్న ఒరాంగుటాన్లను అటవీశాఖ అధికారులు రక్షించారు. సుమత్రా, బోర్నియో ప్రాంతాలకు చెందిన ఈ అరుదైన కోతులు భారతదేశంలో ఉండవు. అక్రమ రవాణా విఫలమవ్వడం వల్లే వీటిని ఇక్కడ వదిలేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. విదేశాల నుంచి వీటిని అక్రమంగా తరలించినట్లు అనుమానిస్తున్న అధికారులు దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించారు.