జన్నారంలో కాంగ్రెస్ ప్రజా పాలన 1000 రోజుల విజయోత్సవ సంబరాలు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా పాలన 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జన్నారం మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు ఘనంగా విజయోత్సవాలు నిర్వహించాయి. నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ చేపట్టి, టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు అజ్మీరా నందునాయక్ మాట్లాడుతూ, ప్రభుత్వం సంక్షేమమే లక్ష్యంగా పేద, మధ్యతరగతి వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని అన్నారు. ప్రజా పాలనపై ప్రజల విశ్వాసం మరింత పెరిగిందని, ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలని పిలుపునిచ్చారు.