ప్రశాంత్ నీల్ సమర్పణలో హారర్ చిత్రం ’418’
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో వస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రం ’418’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. సూర్యరాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఒక భయానక ప్రపంచం తాలూకు రహస్యాలను ఆవిష్కరిస్తుందని చిత్ర బృందం తెలిపింది.