మసూద్ అజర్ సహా ఉగ్రవాదులను జాబితాలో చేర్చిన పాకిస్థాన్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: World

ఎఫ్‌ఏటీఎఫ్ సమీక్ష నేపథ్యంలో పాకిస్థాన్ మరో నాటకానికి తెరలేపింది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ సహా పలువురు ఉగ్రవాదుల పేర్లను 2026 మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది. గ్రే లిస్ట్ నుంచి తప్పించుకునేందుకే పాక్ ఈ కుట్రకు తెరలేపిందని భారత వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఎఫ్ఐఏ రెడ్‌బుక్‌లో మసూద్ అజర్‌పై రివార్డును 70 లక్షలకు పెంచింది.