లింగయ్యపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగయ్యపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును సర్పంచ్ కొత్తపెల్లి శ్రీనివాస్ సోమవారం బాధితుడి కుమారుడికి అందజేశారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు 26 వేల రూపాయల విలువైన చెక్కును లబ్ధిదారునికి అందించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు గొప్ప వరమని కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.