తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కరీంనగర్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది.