టాలీవుడ్ లో కొత్త సినిమా ప్రారంభం: పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా మూవీ లాంచ్

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

సకల సమృద్ధి ఆర్ట్స్ పతాకంపై కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైందని చిత్ర యూనిట్ వెల్లడించింది. రాజీవ్ వర్మ హీరోగా, మలైకా టి. వాసుపాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వం వహిస్తున్నారు. కనుమూరి ప్రసాద్ రాజు నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ప్రేమకథా చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు.