ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికలు: పెదకాకానిలో ఓటు హక్ కు వినియోగించుకున్న బోయపాటి శ్రీను
రిపోర్టర్: రమేష్
స్థలం: పెదకాకాని
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న పరిషత్ ఎన్నికల్ లో ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటేశారు. అనంతరం ఓటర్లందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్ లో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నట్లు సమాచారం అందింది.